Sunday, May 13, 2018

MANAMU YAESU PRABHUNI MAHIMA TELUGU LYRICS


పల్లవి: మనము యేసు ప్రభుని మహిమ కనుగొంటిమి

1. తండ్రినుండి కలిగిన ఏకైక పుత్రుని మహిమ
వలె ఆయన మహిమను - కనుగొంటిమి

2. నీవు నమ్మిన యెడల - దేవుని మహిమ చూతువు
జీవ పునరుత్థానము యేసు

3. ప్రత్యక్షగుడారమును - మేఘము కమ్మగానే
యెహోవా తేజస్సు నిండెను

4. దేవుని నివాసము - మనుజులతో నున్నది
నివసించు - దేవుడే వారిలో

5. మహిమా ప్రభావముతో - మకుటము ధరించిన క్రీస్తు
తనయులను తెచ్చె మహిమకు

6. మన రక్షణ కర్తను శ్రమతో - సంపూర్ణుని జేయ
మన తండ్రికే తగియున్నది

7. మన చులకని శ్రమలు - రాబోవు మహిమ యెదుట
ఎన్నతగినవి కావు

8. పరిశుద్ధ పట్టణములో - దేవునికే మహిమ
ప్రభువునకే మహిమ హల్లెలూయ

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...