Sunday, May 13, 2018
MANASA YAESU MARANA BAADHA TELUGU LYRICS
మనస యేసు మరణ బాధ లెనసి పాడవే తన నెనరుఁ జూడవే యా ఘనునిఁ గూడవే నిను మనుప జచ్చుటరసియే మరక వేఁడవే ||మనస||
1. అచ్చి పాపములను బాప వచ్చినాఁడఁట వా క్కిచ్చి తండ్రితో నా గెత్సెమందున తాఁ జొచ్చి యెదను నొచ్చి బాధ హెచ్చుగనెనఁట ||మనస||
2. ఆ నిశోధ రాత్రి వేళ నార్భటించుచు న య్యో నరాంతకుల్ చేఁ బూని యీటెలన్ ఒక ఖూని వానివలెను గట్టి కొంచుఁబోయిరా ||మనస||
3. పట్టి దొంగవలెను గంత గట్టి కన్నులన్ మరి గొట్టి చెంపలన్ వడిఁ దిట్టి నవ్వుచున్ నినుఁ గొట్టి రెవ్వ రదియు మాకుఁ జెప్పుమనిరఁ ట ||మనస||
4. ముళ్లతోడ నొక కిరీట మల్లి ప్రభుతలన్ బెట్టి రెల్లు కఱ్ఱతో నా కల్ల జనములు రా జిల్లు మనుచుఁ గొట్టి నవ్వి గొల్లు బెట్టిరా ||మనస||
5. మొయ్యలేక సిల్వ భరము మూర్ఛ బోయెనా అ య్యయ్యో జొక్కెనా యే సయ్య తూలెనా మా యయ్యనిన్ దలంపగుండె లదరి పోయెనా ||మనస||
6. కాలు సేతులన్ గుదించి కల్వరి గిరిపై నిన్ గేలిఁజేయుచు నీ కాళ్లమీఁదను నినుప చీలలతోఁ గ్రుచ్చి నిన్ను సిల్వఁ గొట్టిరా ||మనస||
7. దేవ సుతుఁడ వైతి వేని తెవరంబుగా దిగి నీవు వేగమే రమ్ము గావు మనుచును ఇట్లు గావరించి పల్కు పగర కరుణఁజూపెనా ||మనస||
8. తన్నుఁ జంపు శత్రువులకు దయను జూపెనా తన నెనరు జూపెనా ప్రభు కనికరించెనా ఓ జనక యీ జనుల క్షమించు మనుచు వేఁ డెనా ||మనస||
9. తాళలేని బాధ లెచ్చి దాహ మాయెనా న న్నేలువానికి నా పాలి స్వామికి నే నేల పాపములను జేసి హింస పరచితి ||మనస||
10. గోడు బుచ్చి సిలువపైన నేడు మారులు మా ట్లాడి ప్రేమ తో నా నాఁడు శిరమును వంచి నేఁడు ముగిసె సర్వ మనుచు వీడె బ్రాణము ||మనస||
11. మరణమైన ప్రభుని జూచి ధరణి వణఁకెనా బల్ గిరులు బగిలెనా గుడి తెరయుఁ జీలెనా దివా కరుఁడు చీఁక టాయె మృతులు తిరిగి లేచిరి ||మనస||
12. ఇంత జాలి యింత ప్రేమ యింత శాంతమా నీ యంతఃకరుణను నేఁ జింత చేయఁగా నీ వింత లెల్ల నిత్య జీవ విధము లాయెనా ||మనస||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment