Sunday, May 13, 2018

MANASAA VINAVAEMAE KREESTHUNIA TELUGU LYRICS


మనసా వినవేమే క్రీస్తునిఁ గని సేవింపవేమే అనుదినమున నీ కాయువు క్షీణం బగుచున్నది గదవే ||మనసా||

1. చింతలేల నీకు వర శ్రీ మంతుడుండు వరకు చెంతను జేరక యెంతసేపు నీ యంతట నుండెదవే ||మనసా||

2. లోకాశలకును నీవు లోకువై యుండకుము ఆకాశము నేలెడు మన ప్రభువును ప్రాకటముగ నమ్ము ||మనసా||

3. మాయ సంతలోన జిక్కి మాయలఁ బోయెదవు కాయము స్థిరమని నమ్మకు మీ నీ ప్రాయము దక్కదుగా ||మనసా||

4. రక్షకయని వేఁడు నీవు రక్షణకై వేఁడు రక్షణఁ బొందుట కిదియే సమయము తక్షణమున వేఁడు ||మనసా||

5. అందరమును గూడి యేసుని మందిరమునఁ జేరి పొందుగ క్రీస్తుని పొగడుచుఁ బాడుచు నందునఁ జేరుదము ||మనసా||

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...