Sunday, May 13, 2018

MOSITHIVAA NAA KORAKAI TELUGU LYRICS

మోసితివా నా కొరకై సిలువ వేదనను
గొల్గొతా నీవు క్రీస్తుకై నిలచితి వేదనలో
సిలువలో రక్తము పాపికి రక్షణ విలువగు మోక్షమును
పాప క్షమాపణ పాపికి ముక్తి పరమ ప్రభుని గనుము            ||మోసితివా||

అమ్మా ఇదిగో నీ సుతుడు వ్రేళాడుచు పిలిచెన్
ఏలి ఏలి లామా సబక్తానీ చే విడిచి
దాహము తీర్చను చేదు చిరకను అందించిరిగా
ముండ్ల మకుట నీ శిరముపై గృచ్చిరి యూదుల రాజని
హేళన చేసిరి గుద్దిరి ఉమిసిరి కొరడా దెబ్బలతో
దేవ నా దేవా ఏల నా చేయి విడనాడితివిలలో           ||మోసితివా||

తర తరాల ఈ లోకం – యుగయుగాల నీ నామం
తరగని వేదన నీకు సిలువ విజయమునకే
కల్వరి ధారా నాథా పాపికి ప్రాణ ప్రదాత
విలువగు రక్త ప్రదాత ఆశ్రిత రక్షణ రాజా
చిందిన రక్తము విలువగు ప్రాణము లోక విమోచనకే
అందదు ఊహకు అంతము ఎప్పుడో సిద్ధపరచు ప్రభువా            ||మోసితివా||

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...