Thursday, December 28, 2017

ALPHA OMEGA YAINA MAHIMANVITHUDA TELUGU LYRICS


 అల్ఫా ఓమెగయైన - మహిమాన్వితుడా
 అద్వితీయ సత్యవంతుడా - నిరంతరం స్తోత్రార్హుడా
 రాత్రిలో కాంతికిరణమా - పగిలో కృపా నిలయమా
 ముదిమివరకు నన్నాదరించే - సత్యవాక్యమా
 నాతో స్నేహమై నా సౌఖ్యమై - నను నడిపించే నా యేసయ్యా

 1. కనికరపూర్ణుడా నీ కృప బాహుళ్యమే - ఉన్నతముగ నిను
  ఆరాధించుటకు అనుక్షణమున నీ - ముఖకాంతిలో నిలిపి నూతన వసంతములో చేర్చెను
  జీవించెద నీకొరకే - హర్షించెద నీలోనే

 2. తేజోమయుడా నీ దివ్య సంకల్పమే - ఆశ్చర్యకరమైన వెలుగులో నడుపుటకు 
     ఆశనిరాశల వలయాలు తప్పించి - అగ్నిజ్వాలగ నను చేసెను 
     నా స్తుతికీర్తన నీవే - స్తుతి ఆరాధన నీకే

 3. నిజస్నేహితుడా నీ స్నేహ మాధుర్యమే - శుభ సూచనగా నను నిలుపుటకు 
     అంతులేని అగాధలు దాించి - అందని శిఖరాలు ఎక్కించెను
     నా చెలిమి నీతోనే - నా కలిమి నీలోనే

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...