Thursday, December 28, 2017

YESU NI THALAPE NAKU ENTHO HAAYI TELUGU LYRICS


 యేసూ నీ తలపే నాకు ఎంతో హాయి
 ప్రభు యేసూ నీ తలపే నాకు ఎంతో హాయి
 యేసు నిను తలంపగానే హృదయమానందముతో నిండున్‌
 నీ సముఖమున ముఖము జూచుచు వాసము చేసినపుడెట్లుండునో

 1. నీ నామస్వర మాధుర్యంబు - నా నాలుక పాడంజాలదు
  మానసము వర్ణింపనేరదు - జ్ఞానశక్తి కనుగొనజాలదు

 2. విరిగిన మతి కాశవీవె - వినయుల కానందమీవె
  దొరలిపడిన నెత్తుదు నీవె - దొరుకువాడ నీవె వెదకిన

  3. నిన్ను గల్గిన వారిమాట - యెన్నలేవు జిహ్వయు కలమున్‌
  నిన్ను ప్రేమతో జూచువారికి - నీదు ప్రేమ యేమియో తెలియును

 4. యేసు మా సంతోషము నీవె - ఈవె మా బహుమతివై యుందువు
  భాసురంబుగ మా మహిమవై - బరగుచుండుము నిత్యము వరకు

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...