అయ్యో నాదగు ఘోరపాపము గదా భారమై నీపై నొరిగె నెయ్యము వీడి మెస్సీయ్య నిన్ సిలువ కొయ్యపైని గొరత కప్పగించిన ||దయ్యో||
1. నిరతము దూతానీక మూడిగము నెరపుచుండఁ దండ్రి పజ్జనుండియు నిరుపమాన సౌఖ్యములఁ దేలు నినుఁ బరమునుండి క్రిందికి దిగలాగిన ||దయ్యో||
2. కోరి నిన్నుఁ గడుపారఁ గనియుఁ గను లారఁ చూచుకొన నేరనట్టి యల మేరి గర్భమున దూయఁబడిన కడు ఘోరమైన ఖడ్గంబు నిజముగ ||నయ్యో||
3. మొయ్యరాని పెనుకొయ్య నొండు నీ మూపుపైన భారముగ మోపి రయ్యయ్యొ యింత బాధ సల్పినది యూ దయ్య వాసులెంత మాత్రమునుగా ||రయ్యో||
4. కోలలచే నెన్నెన్నొ పెట్లు పెను గోలగాక యెన్నెన్నొ తిట్లు కృప మాలి నీదు వదనమ్ముపై నుమియ నేల నింత కోపంబురాదు నిజ ||మయ్యో||
5. ముండ్లతోడ మకుట మొక్క టల్లి కడు మూర్ఖత నీ తలపైనిఁ బెట్టి నీ కండ్ల కొక్క గంతఁ గడ గండు పెట్టఁ గారణము నిజముగా ||నయ్యో||
6. ఈపు ప్రాణమును నీవిగ నొసఁగ నీటెతోడఁ బ్రక్కను బొడుచుట హా భావమందుఁ దలపోసి చూడ నల బంటు గాదు బల్లెంబు గాదు నిజ ||మయ్యో||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా (2) ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా (2) ||ఇంత కాలం|| ఎన్ని ఏళ్ళు గడచినా – ఎన్ని తరాలు మారినా (2) మారని వ...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
పల్లవి: పరలోకమే నా స్వాస్థ్యము - ఎపుడు గాంతునో నా ప్రియ యేసుని - నేనెపుడు గాంతునో 1. ఆకలిదప్పులు దుఃఖము - మనోవేదన లేదచ్చట పరమ మకుటము పొం...
No comments:
Post a Comment