పరమ రాజ్యమునకు నరులు తిరిగి పుట్టవలయు ననుచుఁ బరమ గురువు యేసు క్రీస్తు స్థిరము చేసెను ||పరమ||
1. వేదశాస్త్ర మెఱిఁగినట్టి యూదుల యధికారియౌ ని కోదే మనెడు పరిసయుండు మదిని దలఁచుచున్ ||పరమ||
2. అతఁడు రాత్రివేళఁ ప్రభుని వెతకి పోయి యెదుట స మ్మతిని నిలిచి పిలిచి పల్కె హితవుతోడను ||పరమ||
3. బోధకుండ నీవు మోక్ష నాధుఁడౌ యెహోవ యొక్క వేద వార్తఁ జెప్పెదవు నీ బోధ నెఱుఁగుదున్ ||పరమ||
4. మఱియు నీవు చేయుచున్న గురుతు లెవ్వరైన దైవ వరము లేని యట్టి పాప నరులు చేయరు ||పరమ||
5. అనుచుఁ బరిసయుండు పల్క వినుచు యేసు కనికరమునఁ దనకు నిట్లు దెలిపెఁ జాలి మనసుతోడను ||పరమ||
6. క్రొత్త జన్మ మెవ్వఁడైన నెత్త కున్న మోక్షమమునకు నెత్తఁబడఁ డటంచు నిజము క్రీస్తు పల్కెను ||పరమ||
7. వినుచుఁ బరిసయుండు ముసలి జనుఁడు మఱల తల్లి గర్భ మునను తిరుగనెట్లు బుట్టు ననుచుఁ బల్కెను ||పరమ||
8. అందు కేసు తెల్పె జలము నందుఁ నాత్మయందు జన్మ మొంద కున్న మోక్ష రాజ్య మొంద రనుచును ||పరమ||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment