Tuesday, January 30, 2018

PARAMA RAKSHKA YAESU PRABHUVAA TELUGU LYRICS

పరమ రక్షక యేసు ప్రభువా నే నీ పాలఁ పడితి పాలన సేయవే ధరజనంబులుసేయు బహువిధ దురితములు క్షమియించి సద్గతి తెరవు జూపి తరింపఁజేసెడి దొరవటంచును మరుగుజోచ్చితి ||పరమరక్షక||

1. క్షితి నబ్ధి తీర పై కతయైన నెన్ననా యితియౌను లెక్కింపఁగా కుతల జన్మంబెత్తియేనిట బ్రతుకు దినముల జేయునఘములు మతి దలపనిమితా యుతంబులు పతితు డనునాగతి యెరుంగను ||పరమరక్షక||

2. పసలేని మాయా దు ర్వ్యసనంబులను జెంది దెసదప్పి యున్నాఁడను వసుధలో దుష్టునికి లోఁబడి మసలజాలని బలహీనత గసటు కన్నులగప్పి కడు మా నసము దూలి విలాపినైతిని ||పరమరక్షక||

3. మదితప్పి గొఱ్ఱెల మంద బాసినగొఱ్ఱె చెదరి చలించినట్లు వదలకెపుడు దురాత్మలైరి స ముదయమునఁ బడితిరిగి వడిచెడి మదికి విశ్రమమేమి లేమిని హృదయ సంతాపముల సుడిఁబడి ||పరమరక్షక||

4. మదపున్నాగము భంగి మత్తిల్లి దుర్భావ హృదయుఁడనై చెడితిని గొదగొనుచు గాయములతో నా యెద దృఢంబించుకయు లేమినిఁ గదల శక్యము గాక మూల్గుచు గొదువలకు లోనైతి ద్రోహిని ||పరమరక్షక||

5. అమిత దురాత్ముఁడ నని కడఁ ద్రోయక క్షమియింపు మీ కరుణచే తమిని మిక్కిలి దుర్విషయగుణ సముదంబులు జుట్టి పాపపు తమము గప్పియు గలుషకానన సమితిలోఁబడి శ్రమలు నొందుచు ||పరమరక్షక||

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...