Friday, January 26, 2018

PRABHUKAE STHOATHRAMU MRUTHINI TELUGU LYRICS

పల్లవి: ప్రభుకే స్తోత్రము మృతిని గెల్చెను
ప్రభు యేసు యెల్ల వేళ విజయ మిచ్చును
ఘన విజయమిచ్చును

1. ఓ సమాధి విజయమేది మరణమా ముల్లెక్కడ
మ్రింగె జయము మరణమున్ ఫలించె సత్యవాక్యము
జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం || ప్రభు

2. దైవజన్మ మొందువారె లోకమున్ జయింతురు
లోకమున్ జయించు విజయమే మన విశ్వాసము
జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం || ప్రభు

3. శ్రమయు బాధ హింసలైన కరువు వస్త్రహీనతల్
క్రీస్తు ప్రేమనుండి మనల నేదియు నెడబాపదు
జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం || ప్రభు

4. అన్నిటిలో పొందెదము ఆయనతో విజయము
అధిక విజయ మొందెదం ప్రేమించు క్రీస్తు ద్వారనే
జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం || ప్రభు

5. జయము పొందువారెల్లరు తన రాజ్యవారసుల్
దేవుడే వారికి తండ్రి వారయన పుత్రులు
జై ప్రభు జై ప్రభు విజయులం విజయులం || ప్రభు

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...