Friday, January 26, 2018

PRABHUKREESTHU YAESU PRAEMIMCH TELUGU LYRICS

ప్రభుక్రీస్తు యేసు ప్రేమించె సంఘమును పరిమళ వాసనగానుండ ప్రభువు చిత్తమును పరిగణించుటయె సంఘము నీ బాధ్యతగాదా! ||ప్రభు||

1. దేవుడిచ్చు బహుమానమె బిడ్డలు గర్భఫలమె మన కిడు స్వాస్థ్యం ఇంపుగ ప్రతిష్టింపను వారిని సంఘమ నీ బాధ్యతగాదా? ||ప్రభు||

2. యువకులు రేపటి సంఘము నందున నాయుకు లౌదురు నయముగను పావనులుగ నిలఁ జేయను వారిని సంఘము నీ బాధ్యత గాదా? ||ప్రభు||

3. బాప్తిస్మమును కృపా ప్రసాదములు ప్రభు వెంచెను పరిశుద్ధముగ ఘనముగ వాటిని గైకొన నిరతము సంఘము నీ బాధ్యతగాదా! ||ప్రభు||

4. దేవుడు జతపర్చిన దాంపత్యము భావములర బంధుత్వములున్ సవ్యంబుగసరి జేయఁగ వాటిని సంఘ మ నీ బాధ్యతగాదా? ||ప్రభు||

5. పామర జనములు ప్రభు నెఱుంగక పెడ మార్గంబుల దిరుగగను మానుగ రక్షణ మార్గము జూపుట సంఘ మ నీ బాధ్యతగాదా? ||ప్రభు||

6. క్రైస్తవ దాతృత్వము నందెదుగుట కర్తను కీర్తించుట యౌను దశమ భాగములు దాత కొసంగను సంఘ మ నీ బాధ్యత గాదా? ||ప్రభు||

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...