ఇయ్యుడి మీకియ్యబడునని ఇయ్యగల శ్రీ యేసు ప్రభువు నెయ్యముతో తన శిష్యవితతికి నయముమీర జెప్పినట్లు ||ఇయ్యుడి||
1. మొదట పరముని నంతునియ్యరే సదమల హృదయంబుతోడ సదయు డగు మన పరమతండ్రి ముదమతోడ నంతయు నిచ్చున్ ||ఇయ్యుడి||
2. శక్తికొలది నియ్యవలెనని భక్తులందరితోడా జెప్పె భక్తితోడ ప్రభుని సేవకు శక్తికొలది నియవలెను ||ఇయ్యుడి||
3. కొంచెముగ విత్తెడివారు కొంచెము సమకూర్చెదరు హెచ్చువిత్తెడి వారికిలను హెచ్చు ఫలములు నిండుగ దొరుకున్ ||ఇయ్యుడి||
4. సంతసంబుతో నిచ్చెడివారి నెంతో దేవుడు కృపతో బ్రోచున్ వింతగా దీవెనలతోడ అంతయు దయచేసి బ్రోచున్ ||ఇయ్యుడి||
5. యేసు కృపను ఎరిగిమనుడి యేసు మార్గమునందు నడువుడి దాసుడై ధనమంత విడిచె నీచులకొరకిలను మున్నె ||ఇయ్యుడి||
6. పరమనిధులను నింపుకొనుడి పరమ దేవుని ప్రేమను గనుడి పరమ నిధులలో చిమ్మెటుండదు దొంగలసలే లేరుసుమండి ||ఇయ్యుడి||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment