కఠిన హృదయమా కరుగవ దేవుని గడువులు గని వినవా దెబ్బలు గలిగిన లోబడవా
1. ఎన్నో గడువులు ఎన్నోమారులు ఎన్నో గడువులు దొరికినను కన్నుమూసికొని కదలుచునుందువు కనికర కరమునుగని మానవా ||కఠిన||
2. సృష్టికర్తకు మ్రొక్కెదవా! తన సృష్టిని గొని పూజించెదవా సృష్టికర్త విరోధి దయ్యముల చేష్టలెల్ల మంద్రించెదవా ||కఠిన||
3. నీరము రక్తముగా మారినను భారముగా క ప్పలు పేలు జోరీగలు గొప్ప తెగులు వచ్చిన గుణపడెనా ఫరోరాజు!
4. దద్దురులై బొబ్బలు పొక్కినను హద్దులేక పిడుగులు పడిన గ్రుద్దినట్లు వడగండ్లు కురిసినను గుణపడెనా ఫరోరాజు ||కఠిన||
5. మిడుతల దండులు చెలరేగి యామిగిలిన వాటిని మ్రింగినను వడివడితడబడు నంధకారమే వచ్చిన గుణపడె నా రాజు ||కఠిన||
6. ఘోషపెట్టి దేశమెల్లనేడ్వగ గుంపులుగా జ్యేష్టులు చావ రోషముతో వెంటబడి నశించి దోషముకై దుఃఖముపడిరే ||కఠిన||
7. నష్టము కష్టము కలిగినను మరి నరులును దేవుడె చెప్పినను ఇష్టపడవు రక్షింపబడుటకై ఇరుకుపడిన నిరుకున జెడిన ||కఠిన||
8. పాపప్రతాపము నెరుగుదువ దాని శాపము తాపము నెరుగు దువా పాపము నొకపరి బట్టితివా అది పట్టుబడి కఠినపరచు ||కఠిన||
9. లోలోపలన న్యాయమబద్దములోపము కలిగిన మోసములో కాలయాపనచేయ నుపాయములేల? వేషధారణయేల ||కఠిన||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా (2) ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా (2) ||ఇంత కాలం|| ఎన్ని ఏళ్ళు గడచినా – ఎన్ని తరాలు మారినా (2) మారని వ...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
పల్లవి: పరలోకమే నా స్వాస్థ్యము - ఎపుడు గాంతునో నా ప్రియ యేసుని - నేనెపుడు గాంతునో 1. ఆకలిదప్పులు దుఃఖము - మనోవేదన లేదచ్చట పరమ మకుటము పొం...
No comments:
Post a Comment