యేసువ జయముతో యెరుషలేమున బ్ర వేశము జేసిన యో ప్రభువా వాసిగ బొగడగ వసుధను జనులు విజయము జేసిన యో ప్రభువా ||యేసువ||
1. మట్టలు బట్టియు బట్టలు బరచియు గట్టిగఁ బాడగ యో ప్రభువా అట్టహాసముతో అశ్వము నెక్కడ అణఁకువఁ గార్దభ మెక్కిన ప్రభువా ||యేసువ||
2. పిల్లలు పెద్దలు పలుకేకలతోఁ బలికి నుతించగ యో ప్రభువా చల్లగ వానిని సరియని యొప్పి సంతోషించిన యో ప్రభువా ||యేసువ||
3. కొందరు వారిని తొందరఁ జేయగ కూర్మిని దిద్దిన యో ప్రభువా అందరు మానిన అరచును రాళ్లని ఆనతి నిచ్చిన యో ప్రభువా ||యేసువ||
4. యెరుషలేం కొరకై యోరిమి జూపియు నేడ్చిన దయగల యో ప్రభువా యెరుషలేమందున యాలయ మంతను శుభ్రపరచిన యో ప్రభువా ||యేసువ||
5. మా కొఱకై తన ప్రాణము బెట్టిన మాన్యుడవీవె యో ప్రభువా మా కొరకై ధర మరణము గెల్చిన మహిమ స్వరూపుడ యో ప్రభువా ||యేసువ||
6. మాదు మనస్సును హృదయము నాత్మను నీదిగ గైకొను మో ప్రభువా సాదర వాక్కులు చక్కఁగఁ బలికియు నాదరించుమము నో ప్రభువా ||యేసువ||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment