Tuesday, March 6, 2018

KRUTHAJNYTHAN THALAVMCHI NAADHU TELUGU LYRICS

పల్లవి: కృతజ్ఞతన్ తలవంచి - నాదు జీవము అర్పింతును
లేదే యిక నే యీవి యిల - అర్పింతును నన్నే నీకు

1. దూరమైతి నీ ప్రేమ మరచి - నే రేపితి నీ గాయముల్
దూరముగ నిక వెళ్ళజాల - కూర్చుండెద నీ చెంతనే

2. ఆకర్షంచె లేకాశలన్ని - లోక మహిమ నడ్డగించు
కోర్కెలన్ని క్రీస్తు ప్రేమకై - నిక్కముగా త్యజింతును

3. తరముల నీ ప్రేమ నాకై - వర్ణింపను అశక్యము
నిరంతరము సేవించినను - తీర్చలేను నీ ఋణము

4. లోకముకై జీవించనింక - నీ కొరకై జీవింతును
నీ కర్పింపన్ నే వెనుదీయన్ - ఈ కొద్ది నా జీవితము

5. చింతించితి గత పాపములకై - ఎంతో నేను యేడ్చుచుంటి
కృతజ్ఞతతో సమర్పింతును - బ్రతుకంతయు నీ సేవకై

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...