Tuesday, March 6, 2018

NEE DEERGA SANTHAME NAA TELUGU LYRICS

నీ దీర్ఘశాంతమే నా హృదయానికి ధైర్యము
నీ కరుణ కటాక్షములే నా బతుకుకు ఆధారము
యేసయ్య కనిపించరే నీలాగా ప్రేమించే వారెవరు

1. కడుపేద స్థితిలోనే కరువే నా బందువాయెను
వయసొచ్చిన తరుణములో వస్త్ర హీనతే క్రుంగ దీసెను
(ఏ) ఆధారము కనిపించని నా బ్రతుకులో ఐశ్వర్యవంతుడా నాన్నాదుకున్నావు
యేసయ్య కనిపించరే నీలాగా దీవించే వారెవరు

2. ఈ లోక జ్ఞానులలో వెర్రివానిగా ఉంటిని
ఎన్నికైన వారిలో వ్యర్థునిగా మిగిలి ఉంటిని
తృణీకరింపబడిన నా బ్రతుకును కరుణ సంపన్నుడా నన్నెన్నుకున్నావు
యేసయ్య కనిపించరే నీలాగా కృప చూపే వారెవరు

3. నా ప్రాణం నాలో క్రుంగి వున్న సమయములో
జీవము గల నీకై నా ప్రాణము పరితపించెను
మధురమైన నీ సహవాసముతో నా జీవ నాథుడా నీ మమతను పంచావు
యేసయ్య కనిపించరే నీలాంటి జీవము గల దేవుడెవ్వరు

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...