నా నిమిత్తమాయన మహిని శ్రమలు పొందెను ఘనధనముల రోసెను అనుమతించె చావుకు
1. నా నిమిత్తమె (3) మరణ మాయెను తన జీవమును నాకు బలిగా ధారపోసెను ||నా నిమి||
2. గొఱ్ఱెపిల్ల రీతిగా గొప్ప శాంతి జూపెను ఉర్వినంత మోపినన్ యోర్చె మౌనవృత్తిని ||నా నిమి||
3. అతడు దోషమెరుగడు అతడు కపటమెరుగడు అయినను దేవుడు అతని నలుగగొట్టెను ||నా నిమి||
4. అతడు యిలను పొందిన అధిక దెబ్బలవలన్ క్షితిని నాకు కలిగెను స్వస్థత మది రూఢీగా ||నా నిమి||
5. రోగముల్ భరించెను వ్యసనములు వహించెను బాగుగా నొత్తిడిన్ బాధలన్ సహించెను ||నా నిమి||
6. గాయములను పొందెను కాయమంత నొచ్చెను హేయమైన నిందలన్ ఎలమిలో సహించెను ||నా నిమి||
7. ఎదిగె నాయన మన యెడల దీన వృత్తిని సదనులమగు ప్రీతితో సరకు చేయమైతిమి ||నా నిమి||
8. తన యనుభవమున్ మనల దోషరహితులన్ చేయ నుద్దేశించెన్ ప్రాణమర్పించెను ||నా నిమి||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment