యేసు నాయకుఁడ యెల్ల వేళలను నీ దాసుల నేలుమయ్యా మోసములన్నిటి మునగఁద్రోతునని బాసలు జేసిన ప్రభుఁడవు నీవెగా ||యేసు||
1. రేయింబవలు మా న్యాయము చెరిపెడి మాయ పిశచిని త్రోయుమి దూరము బాయక భక్తుల చేయి విడువని బహుశ్రేష్టుఁడ నీవెగా ||యేసు||
2. హృదయము లోకము మది పాపము మమ్ము సతతము శ్రమ పెట్టును సదయుఁడ మమ్మును వదలక నిత్యము మది తలపులలో మహిమగనేలుమీ ||యేసు|
3. కాపాడుమి మమ్ము మాపు రేపు నీ శ్రీ పాదము లొద్దను ఏ పాపములును ఏలకుండగ నీ ప్రాపునఁబెంచుము మాపాలకుఁడవో ||యేసు||
4. మా కొరకై నీ మేనును మ్రానున మేకులతోఁగొట్టగ మానము మహిమలు మనుజుల కియ్యను భానుఁడ రాజుగ బ్రతికిలేచితివి ||యేసు||
5. చెఱను చెఱనుగా మరి పట్టుక నీవు పరమున కరిగితివే వరముల నిడితివి ధరలో నరులకు పరముఁడ నీ దయ మరువశక్యమా ||యేసు||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment