యేసు వస్త్రపు చెంగును మాత్రమే యాసించి ముట్టినట్టి దోసకారుల రోగముల్ వెంటనే తొలఁగి పోయెను నిజముగ ||యేసు||
1. గుంపుకూడిన జనులతోఁ బ్రభు యేసు సొంపుతోఁ బోవునపుడు తెంపుతో రమణి యొకతె ప్రభు చెంగు తెలియకుండను ముట్టెను ||యేసు||
2. అంతటను రక్తధార యామె కొ కింతైన లేకపోయె ఇంతలోఁ ప్రభువు యెఱిఁగి తనయొక్క వింతఁ జూపెను జనులకు ||యేసు||
3. ప్రజలార మీలో నొకరిన్ నాదు ప్ర భావంబు స్వస్థపరచె నిజమంచుఁ ప్రభువు చెప్పె వణుఁకుతో గజయాన వచ్చి నిల్చె ||యేసు||
4. ఒదుగుచుండిన వనితతో శ్రీయేసు అదురు మానుమి యింకను ఇదిగో నీ విశ్వాసము రక్షించె ముదిత నెమ్మదిని వెళ్లు ||యేసు||
5. ఏపుమీరగ యేసును మీ యొక్క ప్రాపుగా నమ్ముకొనుఁడి ఆపదలు దొలఁగించును నిజముగఁ పాపముక్తులఁ జేయును ||యేసు||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment