Wednesday, March 28, 2018
YAESU VIBHUNIAO DHALAOCHI MADH TELUGU LYRICS
యేసు విభునిఁ దలఁచి మదిలో ద్వేషము లణఁగింపరే మోస విశ్వ భ్రాంతు లెల్ల రోసి పరిహర్షింపరే ||యేసు||
1. కామ క్రోధ లోభ మోహ క్షామ గుణములు మానరే హేమ రీతిని దేవ కృపలో క్షేమ మున్నది కానరే ||యేసు||
2. సత్యవేద సార మెల్ల నిత్యము రుచిచూడరే సత్త లేని దురిత జాలి బొత్తిగా విడ దీయరే ||యేసు||
3. కర్త కర్తయనుచు వేఁడి వ్యర్ధులై చెడి పోకరే స్వార్ధ చర్య లెల్ల మాని కర్త యేసుని బోలరే ||యేసు||
4. బంధు మిత్రు శత్రు నెనరు నిందుఁ జూపఁ బూనరే యందమైన మోక్ష విభవము లందుఁ గని హర్పింపరే ||యేసు||
5. మోక్ష వైభవ మెదలోఁ దలఁచి మోసమున బడిపోదురే కక్షి సాతాన్ ముచ్చు వలలను హెచ్చుగాఁ దెగఁగొట్టరే ||యేసు||
6. సద్దులేకను దేవ సేవ ముద్దుతో ఁ గొని యాడరే హద్దు మీరు విమత సాతాన్ సుద్దులను ద్యజియింపరే ||యేసు||
7. బాధ చేసెడి గురుల వీడుచు బొధకుల దరిఁ జేరరే నాధు క్రీస్తును నమ్మి మీరలు సాధులై వర్తింపరే ||యేసు||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment