యేసునాధుని సిలువపైని వేసి శ్రమఁబొదించినది నా దోసమే దుస్సహ వాసమే ||యేసు||
1. కంటక కిరీట మౌదల నంటగొట్టించినది నాచెడు తలఁపులే పాపపు పలుకులే ||యేసు||
2. మృదుకరంబుల మేకులందింపి నదితలఁప నా హస్తకృత కా ర్యంబులే దుష్క ర్మంబులే ||యేసు||
3. పాదయుగమున నాటిచీలలు బాధ నొందించినది నా చెడు నడకలే దోసపు పడకలే ||యేసు||
4. దాహముం గొనఁజేదు చిరకను ద్రావదలఁచినది మధుపానా సక్తియే యందను రక్తియే ||యేసు||
5. హెచ్చుగ లోహిత పతనముగఁ గ్రుచ్చిన కుంతంబు నా పా పేచ్ఛలే హృదయదు రేచ్ఛలే ||యేసు||
6. పావనగాత్రంబు క్షతమయ మై వెతలపాల్జేసినది నా దేహమే యఘ సం దోహమే ||యేసు||
7. దీనిఁగని నా మానసాబ్జము లోని కలుషము దూరపర్చక నడుతునా ధారుణిఁ గడుతు నా ||యేసు||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment