Wednesday, April 18, 2018
GHANADHAEVA PRIYA THANAYUMDAA TELUGU LYRICS
ఘనదేవ ప్రియ తనయుండా జగద్రక్షా వినుతి జేతుము నీ మహిమన్ ఘనతరంబుగ గత సంవత్సర దినము లన్నిట మాకు నీభువి ఘనసుఖము లొనరించి మరి నూతనపు వత్సర మొసగినందుకు ||ఘనదేవ||
1. అధిక ప్రేమలొసఁగుము యేసు ప్రభు కుదురుగ నీ వత్సరము ప్రధమ దినమున మమ్ము నందరి ముదముతో నిచ్చటకుఁ జేర్చితి ప్రబలమగు సంగీతస్తుతులను మిగులబొందుము యేసు రక్షక ||ఘనదేవ||
2. అంచితముగ నిచ్చటన్ గూడిన సభలో స్త్రీలన్ బురుషుల బిడ్డలన్ మంచి మార్గమునుంచి నీ యత్యంత ప్రేమతోఁ గావు మిలను చంచలులు గాకుండ నీ కృప లుంచి మము రక్షించుమో ప్రభు ||ఘనదేవ||
3. దీవించు ప్రభుయేసువా సువార్తికులన్ సావధానముగా భువిలో భావమందున నీపదంబుల సేవ బాగుగఁ జేయుచున్ నీ జీవజల వాక్యంబులన్ ధర ధీరతనుఁ బ్రకటింపఁ జేయుము ||ఘనదేవ||
4. పరముండ ధర నీ సభలన్ నూతనముగ స్థిరపర్చి బలపర్చుము సరసముగ నాశీర్వచనము ల్విరివిగా నొసంగుచున్ నూ తన సహోదర ప్రియుల సమితిని మరియుఁ జేర్చుము నీ సభలలో ||ఘనదేవ||
5. కరుణాళ యీవత్సరము క్రైస్తవ బడుల ధరణిబ్రబలఁ జేయుమా సరిగ నుపాధ్యాయులందరి మరి మరీ దీవించు ప్రభువా స్థిరముగా పరమార్ధములు బా లురకు గరవుచునుండఁ జేయుము ||ఘనదేవ||
6. భాసురంబుగ పరలోక ప్రకాశుఁడా దాసబృందములన్ గావు వాసిగా నరలోకము నని వాసులగు మీ దాసులందరి దోషరాసిని ద్రోసి నీ కృప జూపుచును రక్షించు మనిశము ||ఘనదేవ||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా (2) ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా (2) ||ఇంత కాలం|| ఎన్ని ఏళ్ళు గడచినా – ఎన్ని తరాలు మారినా (2) మారని వ...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
పల్లవి: పరలోకమే నా స్వాస్థ్యము - ఎపుడు గాంతునో నా ప్రియ యేసుని - నేనెపుడు గాంతునో 1. ఆకలిదప్పులు దుఃఖము - మనోవేదన లేదచ్చట పరమ మకుటము పొం...
No comments:
Post a Comment