Wednesday, April 18, 2018
GHANAMAINA KREESTHU KRUPAO TELUGU LYRICS
ఘనమైన క్రీస్తు కృపఁ గనుగొంటి నిపుడు ఘనుఁడు తన మహిమచేఁ గాఁచి పెంచెను నన్ను ||ఘనమైన||
1. ఆపదలలో మునిఁగి యడలుచుండఁగ నన్ను ఁ జేపట్టెను చింత చే జెడకు మనుచు వేపాకు కన్న నిది వెగటైన నా జిహ్వ తీపుగా నొనరించి స్ధిరపరచె నిపుడు ||ఘనమైన||
2. ఘనమైన యాపదల కడలిలో ఁ బడి యున్న ఘనుఁడు నా దెసఁ జూచి మనసు నొచ్చుకొనియె కనికరముచే నిన్నుఁ గరుణింతు నిప్పుడె వెనుకఁ జూడక తనదు వెంట రమ్మనెను ||ఘనమైన||
3. కుల గోత్రములు వీడి కుటిలంబు దిగనాడి వలబడ్డ చేఁపవలె వదల కని పలికెన్ సిలువపై నసు విచ్చి బలహీన మెడలించి వలవలను కన్నీరు వల పోసినాఁడు ||ఘనమైన||
4. పర్వతములపైఁ గట్టు పట్టణమువలె నిన్ను నుర్విలో నుంచితి నుచి తంబుగాను సర్వజనులకు వెలుఁగు సాక్షిగా నీవుండి గర్వింప వలదనుచు ||ఘనమైన||
5. సదమలం బగు జ్ఞాన సరణి యిదె నా మాట ముదముతో నమ్మినను మోక్ష మోసఁగెదను కదిసి సాతాను బలు కాడిక్రిందను బడిన విదలించి నరకమున వేతునని పలికెన్ ||ఘనమైన||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment