Wednesday, April 18, 2018
MAA YAESU KREESTHUNI MARUAOGU TELUGU LYRICS
మా యేసు క్రీస్తుని మఱుఁగు గల్గెనురా నా యాత్మ ఘనరక్షా నగమ నెక్కెను రా ||మా యేసు||
1. ముందు నాలో పాప ములు జూడఁ బడెరా డెందము తా నన్ని టిని నొప్పుకొనెరా యందుకై బలు దుఃఖ మాత్మఁ జెందెనురా సందేహములు వీడు జాడఁ గన్గొనెరా ||మా యేసు||
2. సువిశేష బోధనా చెవు లాలించెనురా అవివేక శాస్త్రోక్తు లంటు వీడెనురా నవసత్క్రైస్తవ గోష్ఠి భువి నా కబ్బెనురా వివిధము లగు వేల్పు ల్విష మైరిగదా ||మా యేసు||
3. బాధగురువుల మోము ల్బహు లజ్జఁబడెరా గాధ మంత్రము లన్ని కడగండ్లయి చెడెరా శోధించి నాయాత్మ శుద్ధిగోరెనురా సాధించి ప్రభుక్రీస్తు శరణుఁ జొచ్చెనురా ||మా యేసు||
4. మతిలోని లోఁతు మ ర్మము గానఁబడెరా మితలేని ఘనపాప మే నిండు కొనెరా హితముగా తన జీవ మిచ్చె క్రీస్తుఁడురా మృతిచేత మన పాప వితతి గొట్టెనురా ||మా యేసు||
5. కులగోత్రముల బుద్ధి కుటిలంబుఁ దెగెరా బలవత్పిశాచ శృం ఖలము విఱిగెనురా సిలువ మోసినవాని చిర సౌఖ్యోన్నతిరా నెలవుగ నాలోన నిలచి యున్నదిరా ||మా యేసు||
6. తనపోల్కె నొరులఁ గ న్గొనఁ బ్రేమయ్యెనురా మనసు దేవునికి న ర్పణ సేయఁ బడెరా ఘన కృపశాంతులు గొనెను నెమ్మదిరా మనసు మార్పడి మోక్ష మహిమ గన్గొనెరా ||మా యేసు||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా (2) ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా (2) ||ఇంత కాలం|| ఎన్ని ఏళ్ళు గడచినా – ఎన్ని తరాలు మారినా (2) మారని వ...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
పల్లవి: పరలోకమే నా స్వాస్థ్యము - ఎపుడు గాంతునో నా ప్రియ యేసుని - నేనెపుడు గాంతునో 1. ఆకలిదప్పులు దుఃఖము - మనోవేదన లేదచ్చట పరమ మకుటము పొం...
No comments:
Post a Comment