పల్లవి: మాకనుగ్రహించిన దైవ వాక్యములచే
మా మనోనేత్రములు వెలిగింపుమయ్యా
అను పల్లవి: రక్షణ నొందిన వారికి దేవుడు
ఒసగిన శక్తిని యెరిగి జీవింతుము
1. రక్షణ కృపలు ప్రభువిచ్చినవే
అతిశయింపలేము అంతయు కృపయే
అమూల్యమైన సిలువశక్తిచే
ఖాళీయైన మమ్మును నింపె
2. పాప మృతులమైన మమ్మును లేపెను
ప్రేమతో మమ్ము ప్రభుతోనే లేపెను
పరలోక పదవి పాపులకిచ్చె
పునరుత్థాన శక్తిచే కలిగె
3. మరణ పునరుత్థాన మందైక్యతచే
బలాతిశయమున్ పొందెదము
విశ్వసించు మనలో తన శక్తి యొక్క
మితిలేని మహాత్మ్యము తెలిసికొనెదము
4. సర్వాధికారము ఆధిపత్యముల కంటె
శక్తి ప్రభుత్వము లన్నిటికంటే
అన్ని నామములలో హెచ్చింపబడిన
యుగ యుగములలో మేలైన నామమున
5. తనశక్తిని బయలుపరచుటకు
ఏర్పరచుకొనెను బలహీనులను
ఎన్నికైన్వారిని వ్యర్థపరచుటకు
నీచులైనవారిని ఏర్పరచుకొనెన్
6. యుద్ధోపరణముల్ ఆత్మీయమైనవి
మానక ప్రభువు విధేయులమగుటే
దుర్గములన్నిటిన్ పడగొట్టు నదియే
ప్రభు యేసు నొసగిన భాగ్యము యిదియే
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment