రారె యేసుని జూతము కోరిక దీర రారె యేసుని జూతము రారె యేసుని జూడ రారాజై మన జీవా ధార కరుణామృత సారమై యున్నాఁ డు ||రారె||
1. సారహీన మగు సం సారాబ్ధిలోఁ జిక్కి భారమనుచు నీత నేరని వారికి తారకమైన దేవకు మారుఁడు యేసుఁడూ రార్చు చుండు టకు భూరిసహాయ కారియై చేయూతకుఁ గోరి యిచ్చుచు క్షేమ తీరం బునకుఁ జేర్చ దారిఁ జూపుచు మీవి చారముల్ దొలఁగించు ||రారె||
2. ఘోరమైన పాప భారంబు మోయుచు దారిఁ గానక తారు మారు లైన నరులఁ గూరిమితో ఁ బిల్చును నారక బాధ లూరక దొలఁ గించుచు నీరసు లంచు భారంబు తా మోయుచు నోరి మధి కముఁ జూపి నేరంబు బాపి శృం గారమైన మోక్ష ద్వారమై యున్నాఁడు ||రారె||
3. కారుణ్యుఁడును నిర్వి కారుఁడు దురితోప కారుండు శుద్ధాలం కారుండౌ యేసుని నే రీతిగా వింటిమో యా రీతి మో క్షారామ మున జూతుము సార వాక్య ధోరణిన్ బడి పోదము దారుణం బగు శ్రమలు బారుబారుగా నున్న పోరి దాఁటి ప్రభునిఁ జేరి సుఖింతము ||రారె||
4. ఆ రమ్యపురిన బ్రే మారగించుచు నిత్య మారోగ్యముకు బొంది సారెసారెకుఁ ప్రభుని నారావముగ స్తోత్రము చారుతర దే వా రాధనముఁ జేతము నోరార నా పేరు నే పూజింతుము దూరస్థులై యున్న వారలం దన రక్త ధారోదకముచేఁ జే కూరునట్లుగఁ జేయు
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment