Tuesday, April 17, 2018

SUKHA MICHCHEGADHA MAAKU PRABH-TELUGU LYRICS


సుఖ మిచ్చెగద మాకు ప్రభుయేసువా నీ సురుచిరమగు వాక్కు నిఖిలకల్మష వనమునకు దవ శిఖి శిఖిలవలె గాల్చు నీదగు ముఖవికాసిత వాక్యములు బహు సుఖము లొసఁగు తవాశ్రితాళికి ||సుఖ మిచ్చె||

1. జగతిలోపల మెండుగ నుండిన వివిధ మగు శాస్త్రములు జూడఁగ మిగుల గందరగోళమై మరి యొకటి కొకటి విరుద్ధముగ మ ర్త్యగణ కల్పిత మగుచు నున్నవి తగని వని ద్రోచితిమి వాటిని ||సుఖ మిచ్చె||

2. నీ వాక్యముల భావము నమ్మిన పాపి జీవుల కది జీవము కేవలం బగు ధర్మశాస్త్రము దేవుఁ డిచ్చిన దొకటి బైబిలు ఈ వసుధఁగల సర్వ పాపులఁ బ్రోవ వచ్చిన నిన్నుఁ జూపెను ||సుఖ మిచ్చె||

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...