Monday, April 30, 2018

VADHDHU MANASA BUDHDHI KURUCHA TELUGU LYRICS


వద్దు మనస బుద్ధి కురుచ పెద్దలకుఁ బెద్ద పరి శుద్ధుఁ డగు క్రీస్తు తా దిద్దు నినుఁ బ్రేమ సరి హద్దులను మీరఁబో ||వద్దు||

1. చెడ్డ తలఁపు లడ్డి నిలుపు మెడ్డెలకు నెద్దెయగు గడ్డు సాతాను నకు మెడ్డుకొని దొడ్డ ప్రభు బిడ్డవలె నడువు మిఁక ||వద్దు||

2. నింద పాలు బొంద మేలు పొందుగను అందముగ ముందు నీ యందు వెలుఁ గొందు ప్రభు సుందర ని బంధనలు మరిచ పో ||వద్దు||

3. ఆశ బెట్టు యేసు తట్టు దోసములు వాసి చనఁ జేసి నను మోసి కొను యేసు నిజ దాసులను బాసి యుండకు మిఁక ||వద్దు||

4. బెండు పడకు నిండు విడకు దండి గల తండ్రి యొడ యుండు యేసుండు నీ యండ నుండఁగ నీ గుండె దిగు లేల యిఁక ||వద్దు||

5. పట్టు విడకు దిటము సెడకు నెట్టుకొని ముట్టడిగఁ జుట్టుకొను కష్టముల బిట్టు విడఁగొట్టు ప్రభు తట్టు కనిపెట్టు మిఁక ||వద్దు||

6. మంచి గుణము లెంచికొనుము వంచనల మించి గ ర్వించి నీ దు ర్భావముఁ ద్రుంచు ప్రభు నొద్ద గురి యుంచి ప్రార్ధించు మిఁక ||వద్దు||

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...