Monday, April 30, 2018
VAECHIYUMTINI NEE THATTU YAESU TELUGU LYRICS
వేచియుంటిని నీ తట్టు యేసువమేము వేచి యుంటిమి నీ తట్టు భాసురఁబుగ మహిమన్ భాసిల్లురాకకై నాశతో కరములు చాచుచు నీవైపు ||వేచి||
1. కూడుచుంటిమి యిచ్చట వేడుకగల కూటంబులలొ కూర్మితో గోడులేనిపరమ కూటంబులలో భక్త కోటులతో గూడి పాడుచునిన్ స్తుతియింప ||వేచి||
2. నమ్మియుంటిమి నీ యొక్క నమ్మకమైన నెయ్యంపు వాగ్దానములన్ ఇమ్ముగ దివికేగి నెమ్మి నెలవులు గట్టి మమ్ముట దోడ్కొని పోవన్ నమ్మబల్కిన మీకై ||వేచి||
3. వెఱచుచుంటిమి యిచ్చట తరుచుగగల్గె కరుకైన స్థితిగతులలోన్ కరువువేదన భీతి మరణ దుఃఖములేని పరమపురమున జేరి మురియు టెప్పుడొ యంచు ||వేచి||
4. నిత్యంబు విలసిల్లెడి నిశ్చలమైన శృంగార స్వర్గంబున ముత్యాల ద్వారమున నిశ్చింతపోవుచు బంగారువీధుల సంచరించుట యెపుడో ||వేచి||
5. రంగుగు క్షయధనముల సంగడిజేరి భంగంబు పడుచుంటిమి దొంగలుదోయని చిమ్మటకొట్టని తుప్పయిన పట్టని యక్షయ ధనమునకై ||వేచి||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా (2) ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా (2) ||ఇంత కాలం|| ఎన్ని ఏళ్ళు గడచినా – ఎన్ని తరాలు మారినా (2) మారని వ...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
పల్లవి: పరలోకమే నా స్వాస్థ్యము - ఎపుడు గాంతునో నా ప్రియ యేసుని - నేనెపుడు గాంతునో 1. ఆకలిదప్పులు దుఃఖము - మనోవేదన లేదచ్చట పరమ మకుటము పొం...
No comments:
Post a Comment