Tuesday, April 17, 2018

VIMALA HRUDHAYA MIMMU VIDHITHM TELUGU LYRICS



విమల హృదయ మిమ్ము విదితంబు నినుఁ గొల్వ యేసునాధా నీదు విమల రక్తము చేత విశదమౌ యెద నిమ్ము విశ్వనాధా ||విమల||

1. అణఁకువ క్షమశాంత మధికముగ నాకిమ్ము ఆత్మనాధా నీకుఁ బ్రణుతమౌ నా యెద ప్రభునిపీఠము జేయు మాత్మనాధా ||విమల||

2. నీ చిత్తమే యంచు నీ పాదములఁ బట్టి నిల్చియుందు నిండు నికరమౌ ప్రకటమౌ సుకరహృదయ మిమ్ము మేసునాధా ||విమల||

3. భయభక్తు లలరెడు భావంబు నా కిమ్ము జీవనాధా నన్ను లయ జీవములయందు జయశాలినిగఁ జేయు మేసునాధా ||విమల||

4. పరిశుద్ధ హృదయంబు పరమేశ నా కిమ్ము ధరణిమీఁద నన్ని తరుణములను నాకా దరణ మీవే యంచుఁ దలఁప నాధా ||విమల||

5. నీ రూపము నిమ్ము నినుఁ బోలి నేనుండ నిత్యనాధా నీదు సారూప్య మెదమీద సంపూర్తిగా వ్రాయు సత్యనాధా ||విమల||

6. ప్రేమపూరిత హృదయ మేమరక నా కిమ్ము ప్రేమనాధా యెంతో ప్రేమమౌ సుమమౌ నేమమౌ బ్రతుకిమ్ము క్షేమనాధా ||విమల||

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...