Tuesday, April 17, 2018

VIMDHU PARAMMDHUAOBEMDLI VIMDH TELUGU LYRICS



విందు పరమందుఁబెండ్లి విందు పరమందుఁ బొందు జనుల డెందములా నందము నొందు ||విందు||

1. సత్య సంధుఁ డైన యేసు సామికి సభకు నిత్య ప్రధానము యెహోవా నిర్ణయించెను రండు ||విందు||

2. నీతి కనికరములతోడ నినుఁ బ్రధానము ప్రీతిగా నొనరించితినని పిలచె సత్యము రండు ||విందు||

3. ఎన్నఁడు విడనాఁడను నే నెంత మాత్రము నిన్నెడఁబాయ నను మాట నిజము దత్తము రండు ||విందు||

4. పరమ నగరు ద్వారములు తెరువఁబడినవి గురుతరమణి తోరణమును గూర్పఁబడినవి రండు ||విందు||

5. నిత్యజీవ పదార్ధములు నిండి యున్నవి సత్యమచట మనము చేర సర్వము మనవి రండు ||విందు||

6. దూత లంత యేసు ప్రభుని బ్రీతిఁ జేయను నూతన సంగీతములను జేతురు వినను రండు ||విందు||

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...