Thursday, April 26, 2018

VINARE MANUJULAARA KREESTHUAO TELUGU LYRICS


వినరె మనుజులార క్రీస్తుఁ డిలనుఁ జేయు ఘనములైన పనులలోనఁ జిత్రమొక్క పని వచించెద ||వినరె||

1. మన మనంబు లలరుచుండ దినదినంబు ప్రభుని నిండు ఘన మహాద్భుతములు వినినఁ దనివిఁ దీరదు ||వినరె||

2. ఇలను బేతనియపురంబు గలదు మరియ మార్తలక్క సెలియలందు వాసముండి రెలమితోడను ||వినరె||

3. పరిమళంపు తైలమేసు చరణములకుఁ బూసిన యీ మరియ సోదరుండు రోగ భరితుఁడయ్యెను ||వినరె||

4. వ్యాధిచేత లాజరుండు బాధనొందుచుండఁ గ్రీస్తు నాధుఁ బిలువనంపి రపుడు నాతు లిరువురు ||వినరె||

5. తమ్ము డక్క సెలియలును బ్రి యమ్ము తనకుఁ గలిగియుండ నమ్మహాత్ముఁ డైన క్రీస్తుఁ డరిగె నచటికి ||వినరె||

6. యేసువచ్చు టెఱిగి మార్త యెదురు గానుఁ బోయి తనదు దోసిలొగ్గి మ్రొక్కి ప్రభువు తోడ బల్కెను ||వినరె||

7. కర్త నీకు దేవుఁడిచ్చు ఘనబలమెఱుగుదును సత్య వర్తి విచట లేని కతన వ్రాలె లాజరు ||వినరె||

8. పిదప మరియవచ్చి క్రీస్తు పదయుగమున కొరిగి యేడ్చి మొదట మార్త పలికినట్లు సుదతి పలికెను ||వినరె||

9. అపుడు కర్త వారిపలుకు లాలకించి మదిని మూల్గి కృపకుఁ బాత్రు రాలితోడ నపుడు నడిచెను ||వినరె||

10. నడిచి లాజరుని సమాధి కడకుఁ జేరి గుహను మూయఁ బడిన రాయి తీయుఁడనుచుఁ ప్రభువు చెప్పెను ||వినరె||

11. యేసుతోడ మార్తపలికె నీ సమాధినునిచి నాల్గు వాసరంబులయ్యెఁ గంపు పట్టి యుండదా ||వినరె||

12. దాని నమ్మి చూడుమని మ హానుభావుఁ డాత్మబలము నూని తండ్రికిపుడు స్తోత్ర మొనరఁజేసెను ||వినరె||

13. లాజరు సమాధినెడలి రమ్ము లెమ్మటంచు లోక పూజితుఁడు మహా రవంబుఁ బూని పల్కెను ||వినరె||

14. మరణమైనవాఁడు ప్రాణ భరితుఁడగుచు లేచి వచ్చెఁ తరుణులధిక హర్షలైరి పెదజనంబుతో ||వినరె||

15. కన వినంగ రాని యిట్టి ఘన మహాద్భుతంబుఁ జూచి జనులు క్రీస్తు యేసునాధు ననుసరించిరి ||వినరె||

16. కనుక మనము వానిఁ జేరు కొని సుఖంబుఁ బడయవచ్చు మనసు నిలిపి యతనియందు మనుట మేలగున్ ||వినరె||

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...