Thursday, April 26, 2018
VINATHI VINATHI VINATHI THRIYAEKUNIKI TELUGU LYRICS
పల్లవి: వినతి వినతి వినతి త్రియేకునికి
అను పల్లవి: మనసునందు సద్గతి నిడును
1. కోపదినమును తప్పించుకొనుటకు - ఏ పని చేసితివి
బాధలు నిన్ను చేరక యుండును - నాథుని కనుగొనిన
2. ఇచ్ఛల నెల్లను ఇలలో విడచి - నెచ్చెలు డేసును నమ్ము
మేదినిసకలము మాయమైపోవును - సదయుడేసు నిలచున్
3. కాయమస్థిరము కాలము నిల్వదు మాయక్షితి మాయమగున్
దాసుడాకాలము వ్యర్థము చేయక - యేసునంగీకరింపుము
4. రక్షకుడేసును సిలువలో గనుము - రక్షింప బడియెదవు
జీవము సత్యము మార్గము చూతువు - దైవసుతునియందు
5. రక్షకు డాశ్రయదుర్గము వైద్యుడు - రక్షణ శృంగము కోట
మింటను దేవుడు బండయు కేడెము - జుంటితేనెయు నాయనే
6. మంచికాపరి నిరతము కాచు - నంచితముగ నడుపున్
జయము నిచ్చున్ త్రోసివేయక - ప్రియముతో పరుగిడరా
7. హల్లెలూయ పాట నార్భాటముతో - నెల్లరకు చాటుము
త్వరగా రాజువచ్చును భువికి - దుష్టుల నణచుటకై
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment