Thursday, April 26, 2018
VMDHANM BONARTHUMOA PRABHOA TELUGU LYRICS
వందనం బొనర్తుమో ప్రభో ప్రభో వందనం బొనర్తుమో ప్రభో ప్రభో వందనంబు తండ్రి, తనయ, శుద్ధాత్ముఁడా వదనంబు లందు కో ప్రభో ||వందనం||
1. ఇన్ని నాళ్లు ధరను మమ్ముఁ బ్రోచియుఁ గన్న తండ్రి మించి యెపుడు గాచియు ఎన్నిలేని దీవెన లిడు నన్న యేసువా యన్ని రెట్లు స్తోత్రము లివిగో ||వందనం||
2. ప్రాత వత్సరంపుఁ బాప మంతయుఁ బ్రీతిని మన్నించి మమ్ముఁ గావుము నూత నాబ్దమనను నీదు నీతి నొసఁగు మా దాత క్రీస్తు నాధ రక్షకా ||వందనం||
3. దేవ మాదు కాలుసేతు లెల్లను సేవకాళి తనువు దినము లన్నియు నీ వొసంగు వెండి, పసిడి జ్ఞాన మంత నీ సేవకై యంగీకరించుమా ||వందనం||
4. కోఁతకొరకు దాసజనము నంపుము ఈ తరి మా లోటుపాట్లు దీర్చుము పాతకంబు లెల్ల మాపి భీతిఁ బాపుము ఖ్యాతి నొందు నీతి సూర్యుఁడా ||వందనం||
5. మా సభలకు పెద్దజేసి పెంచుము నీ సువార్త జెప్ప శక్తి నీయుము మోసపుచ్చు నంధకార మంతఁ ద్రోయుము యేసు కృపన్ గుమ్మరించుము ||వందనం||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment