Thursday, April 26, 2018

VMDHANM NEEKAE VMDHANM PARISHU TELUGU LYRICS


వందనం నీకే వందనం పరిశుద్ధ శిరమా వందనం నీకే వందనం వందనం బొనరింతు నీ దౌ నందమగు ఘన నామమునకె ||వందనం||

1. సుందరుఁడ నీ శిరసు హేళనఁ బొందె ముండ్ల కిరీట ముంచగ నెందుఁ జూచిన రక్త బిందులు చిందుచుండెడి గాయములతో గ్రందెనా మోము కుందెనా యి(క నే నెందు( బోవక నిన్నుఁ గొలిచెద నందముగ మహిమ ప్రభువా ||వందనం||

2. భీకరుఁడ నీ యెదుట సర్వ లోకములు వణికెడు ఘనముఖ మే కరణి నుమి వేయఁబడియె వి కార రూపము నొందికందెను శ్రీకరా శ్రీ శు భాకరా నే నీ ముఖ ప్రకాశము పాడుజేసితి నో కరుణ భాస్కర క్షమించుము ||వందనం||

3. మించు నీ ముఖ లక్షణము లహ మంచి పెదవుల రంగుఁ జూడఁగఁ గొంచెమైనను గనుపడక కృ శించి దౌడలు క్రుంగిపోవుట నెంచఁగా నాలో చించఁగా ఆ నీ యంచితపు బల శౌర్యములు హ రించి పోయెను మరణ బలమున ||వందనం||

4. సిలువ యెదుటను నిపుడు నేనిఁక నిలిచి నినుఁ బ్రార్థింతుఁ బ్రభువా ఖలుఁడ నని ననుఁ ద్రోయకుము నే నలసి సొలసిన నిన్ను విడువక పిలిచెద నిన్నేఁ గొలిచెద నీ తల బలిమి చావున వాల్చగను నా యేసు నినుఁ జేతులతో నాపెద ||వందనం||

5. నిన్ను నేఁ గొనియాడుటకు నిపు డున్న భాషలు చాల విఁక ని న్నెటుల నే నుతియింతునో హో సన్న రక్షక ప్రోవు న న్నెడ బాయకు ఖిన్నునిఁ జేయకు నా కొర కిన్ని బాధల నొందితివి నా యన్న నా జీవంబు నీదే ||వందనం||

6. మరణ దినమున భయము పడి నీ కొర కెదురు జూడంగఁ గృపతో వరబలుండా నా విరోధుని కరకు శరములఁ ద్రుంచ రావె శూరుఁడా దేవకు మారుఁడా అటు నీ మరణ రూపము సిలువపై నా తరుణమునఁ జూపుము యెహోవా ||వందనం||

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...