Thursday, April 26, 2018

VMDHANMBONARTHUMOA PRABHOA PRABHOA TELUGU LYRICS


వందనంబొనర్తుమో ప్రభో ప్రభో
వందనంబొనర్తుమో ప్రభో ప్రభో
వందనంబు తండ్రి తనయ శుద్ధాత్ముడా
వందనంబు లందుకో ప్రభో ||వందనం||

1.ఇన్ని నాళ్ళు ధరను మమ్ము బ్రోచియు
గన్న తండ్రి మించి ఎపుడు గాచియు
ఎన్నలేని దీవెన లిడు నన్న యేసువా
యన్ని రెట్లు స్తోత్రములివిగో ||వందనం||

2.ప్రాత వత్సరంపు బాప మంతయు
బ్రీతిని మన్నించి మమ్ము గావుము
నూత నాబ్దమునను నీదు నీతి నొసగుమా
దాత క్రీస్తు నాథ రక్షకా ||వందనం||

3.దేవ మాదు కాలుసేతు లెల్లను
సేవకాలి తనువు దినములన్నియు
నీ వొసంగు వెండి పసిడి జ్ఞానమంత నీ
సేవకై యంగీకరించుమా ||వందనం||

4.కోతకొరకు దాసజనము నంపుము
ఈ తరి మా లోటుపాట్లు దీర్చుము
పాతకంబు లెల్ల మాపి భీతి బాపుము
ఖ్యాతి నొందు నీతి సూర్యుడా ||వందనం||

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...