యాకోబు బావి కాడ యేసయ్యను చూసానమ్మా
ఎండా వేళ ఎంతో అలసి ఒంటరిగా ఉన్నాడమ్మా (2)
దాపు చేరి నన్ను చూసి దాహమని అడిగాడమ్మా (2)
నేనిచ్చుఁ నీళ్లు నీకు ఎన్నడు దప్పిక కావన్నాడే (2) ||యాకోబు||
అయ్యా నే సమరయ స్త్రీని – మీరేమో యూదులాయె
మీకు మాకు ఏనాడైనా – సాంగత్యము లేకపాయె (2)
నేనిచ్చుఁ నీళ్లు మీరు ఎలా పుచ్చుకుంటారయ్యా (2)
చేదుటకు ఏమి లేదు నాకెట్లు ఇస్తావయ్యా (2) ||యాకోబు||
అయినా నీళ్లు నాకు ఇమ్మని నేనడిగానే
నీళ్లు నీకు ఇస్తాగాని నీ భర్తను రమ్మన్నాడే (2)
అయ్యా నే ఒంటరిదాన్ని నాకెవ్వరు లేరన్నానే (2)
లొపేమి ఎరగనట్టు లోగుట్టు దాచినానే (2) ||యాకోబు||
నీకు భర్త లేడన్నాడే పెనిమిట్లు ఐదుగురుండే
ఇప్పుడున్నవాడు కూడా నీకు భర్త కాదన్నాడే (2)
వివరంగా నా గుట్టంతా విప్పి నాకు చెప్పాడమ్మా (2)
ఆనాటి నుండి నేను ఆయన సాక్షినయ్యానమ్మా (2) ||యాకోబు||
నా గుట్టు విప్పినవాడు నీ గుట్టు విప్పుతాడు
ఏ తట్టు చూస్తున్నావో లోగుట్టు దాస్తున్నావో (2)
గుట్టు రట్టు కాకముందే తప్పులొప్పుకోవాలమ్మా (2)
తప్పకుండ యేసు ముందు తల వంచి మొక్కాలమ్మా (2) ||యాకోబు||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ఇంత కాలం నీదు కృపలో కాచిన దేవా (2) ఇకను కూడా మాకు తోడు నీడ నీవే కదా (2) ||ఇంత కాలం|| ఎన్ని ఏళ్ళు గడచినా – ఎన్ని తరాలు మారినా (2) మారని వ...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
పల్లవి: పరలోకమే నా స్వాస్థ్యము - ఎపుడు గాంతునో నా ప్రియ యేసుని - నేనెపుడు గాంతునో 1. ఆకలిదప్పులు దుఃఖము - మనోవేదన లేదచ్చట పరమ మకుటము పొం...
No comments:
Post a Comment