Friday, May 11, 2018
RAMMANUCHUNNAADU NINNU PRABHU TELUGU LYRICS
రమ్మనుచున్నాడు నిన్ను ప్రభు యేసు
వాంఛతో తన కరము చాపి
రమ్మనుచున్నాడు ||2||
ఎటువంటి శ్రమలందును ఆదరణ నీకిచ్చునని ||2||
గ్రహించి నీవు యేసుని చూచిన
హద్దు లేని ఇంపు పొందెదవు ||2|| ||రమ్మను||
కన్నీరంతా తుడుచును కనుపాపవలె కాపాడున్ ||2||
కారు మేఘమువలె కష్టములు వచ్చిననూ
కనికరించి నిన్ను కాపాడును ||2|| ||రమ్మను||
సోమ్మసిల్లు వేళలో బలమును నీకిచ్చును ||2||
ఆయన నీ వెలుగు రక్షణనై యుండును
ఆలసింపక త్వరపడి రమ్ము ||2|| ||రమ్మను||
సకల వ్యాధులను స్వస్థత పరచుటకు ||2||
శక్తిమంతుడగు ప్రభు యేసు ప్రేమతో
అందరికి తన కృపలనిచ్చున్ ||2|| ||రమ్మను||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment