Friday, May 11, 2018
RAMMU PARISHUDHDHAATHMA DHAEVU TELUGU LYRICS
రమ్ము పరిశుద్ధాత్మ దేవుఁడా మమ్మును గృపాస నమ్ముకడకు నెమ్మి నడుపుమా మమ్ము నడుపు దీక్షతోఁబ రమ్ము విడిచి యాత్మస్వరూ పమ్మున నరుదెంచిన దై వమ్ము నీవెకద యెహోవ ||రమ్ము||
1. లోకయాత్ర చేయునప్పుడు చీ కాకుపడిన మాకు నీవె మార్గ దర్శివై వీఁక నొసఁగి మాకరంబుఁ జేకొని పరిశ్రమముఁబాపి సిలువఁ బడినవానికడకు త్సేకమూని మమ్ముఁజేర్ప ||రమ్ము||
2. భక్తవన వసంతదైవమా నీయందుఁ బ్రేమా సక్తివృద్ధిచేసి మనుపుమా ముక్తిదాత యేసువిభుని రక్తమహిమఁ దెల్పియఘ వి ముక్తులనుగఁజేసి మమ్ము యుక్తమార్గమందు నిలుప ||రమ్ము||
3. జీవితపుబాధ లెన్నియో పెనుఁబ్రోవులగుచు నావరించి మమ్ముఁ దా కిన మాకు నీవె హితుఁడవగుచు భావమిచ్చి భయముఁదీర్చి జీవ మైన యేసుపాద సేవకు మముసిద్ధపఱుప ||రమ్ము||
4. పలువిధంబులైన చింతలు చెలరేఁగి మమ్ము కలఁతపెట్టు నవసరం బున వలనుచెడిన మామనముల మలయు వ్యాకులతను మాన్పి వలయు నాదరణము నిచ్చు పలుకుదోడు వీవెయగుచు ||రమ్ము||
5. తొలిప్రవక్త లెంద రెందఱో నీ ప్రేరణమునఁ బలికినట్టి వేదమందునఁ గల నిగూఢ భావములను దెలుపు నొజ్జవీవెయగుటఁ దెలిపి వాని మమ్ము జ్ఞాన కలితమతులఁ జేయుకొఱకు ||రమ్ము||
6. సడలివాడిపోవుచున్న మా విశ్వాసలతను బలసమృద్ధి నుద్ధరించి మా యెడఁదశోధనములకతనఁ బొడము సంశయాంకురంబు లడఁచి ప్రేమఁ జ్యోతిమాలోఁ గడుస్థిరముగ వెలుఁగజేయ ||రమ్ము||
7. స్తుతులు నుతులు నీకెచెల్లుఁగా వుత యుగయుగంబు లతులభక్తిని న్నె కొలుతుము క్షితినివీడ మమ్ము మోక్ష గతికి నడిపి చేర్పుమయ్య మృతికి మృత్యువైనవాని వితతసింహపీఠిపైని ||రమ్ము||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment