Friday, May 11, 2018

RAMMU RAMMU MAA YIMTIKI TELUGU LYRICS


రమ్ము రమ్ము మా యింటికి తండ్రీ రమ్ము రమ్ము ||

1. జగములగన్న ప్రేమ గర్భుడవు జగములకావల నుందువె నీవు సరగ రమ్ము నీ బిడ్డలగృహమును సందీపనంబు జేయ ||రమ్ము రమ్ము||

2. సంతస ప్రేమాశాంతంబుల నిశా(తంబై యీ గృహ మెల్లప్పుడు సంతత స్వర్గవాసరూపమై సమృద్ధి పొందునటుల ||రమ్ము రమ్ము||

3. అనలజ్వాల సపర్యలు వదలి యనిలపక్ష సంచరణమువదలి అనయము నీ గృహవాసివి నీవై యాశీర్వదించుటుల ||రమ్ము రమ్ము||

4. నీ ఘననామోచ్చరణము చేత నీ గృహమెల్లను పావనమై నీ యాగప్రేమ మర్మంబులు జగతి బాగుగ దెలియునటుల ||రమ్ము రమ్ము||

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...