Friday, May 11, 2018

RAMMU RAMMU PARISHUDHDHAATHMAA TELUGU LYRICS


రమ్ము రమ్ము పరిశుద్ధాత్మా రమ్ము రమ్ము రమ్ము దీవింపఁగ నిమ్ము నీదు కృపను నింపు మా డెందముల్ నెమ్మదిఁ బొందంగ ||రమ్ము||

1. జీవంపు టూటవు ప్రేమ జ్వాల వీవె దేవ దాన మీవె యాద రించువాఁడ ||రమ్ము||

2. దేవహస్త మీవె వరము లన్ని నీవె నీవె తండ్రి వాగ్ధ త్తమ్మయి వెలుగుచుండు ||రమ్ము||

3. మాటలాడు శక్తి నిచ్చి నాయాత్మను మేటిల్ల నను నభి షేకించుమీ దేవ ||రమ్ము||

4. ఇమ్ము నీదు వెలుఁగు నింపు నీ ప్రేమతో కమ్ము నాకుఁ తోడు నన్ను బలపర్చుమా ||రమ్ము||

5. పారదోలు దవ్వు నాత్మ శత్రువుల నిం పార నీదు నెమ్మ దిచ్చి ప్రోవు నన్ను ||రమ్ము||

6. ముందు నీవు నడువ నన్ను డాయ దేది యిందు నన్ను ఁ జెరచు వారు లేరు భువిని ||రమ్ము||

7. జనకుఁ జూపు నాకు నట్లె చూపు సుతుని ననయ మెఱిఁగి దేవ నిను నమ్మి జీవింప ||రమ్ము||

8. జనక సుతాత్మయౌ ఘనత్రిత్వమౌ దేవా నిను సన్నుతింపను నీదు దయ నంపుమా ||రమ్ము||

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...