Friday, May 11, 2018

RAMMU SHREE YAESOO SAMMATHI TELUGU LYRICS


రమ్ము శ్రీ యేసూ సమ్మతి నాదు మనమున నిలువ నిమ్ము నా పెదవుల నీతి అగ్నిచే నంటఁ గ్రమ్మర నా నత్తి వదలి నీ కృపఁ బొంద ||రమ్ము||

1. నిన్ను స్తుతింతు నీ కృప నెపుడు నెన్ని కీర్తింతుఁ బన్ను గ నీ కృప ని న్నెన్నఁ డెరుఁగని నరుల కన్న యేసున్నా నీ ధన్య రుధిరమె చాలు ||రమ్ము||

2. తరమె యెన్నఁగను దత్కృపను భూ నభముల నైనన్ నిరతము నీ ప్రేమ నీతి పరిమితిచే ధరఁ దేజో వాసులకుఁ గలిగించుఁ గడు వింత ||రమ్ము||

3. భవదీయ కృపను బాగుగఁ జాటి భువి నీ చిత్తమును అవిధి నెం చక తీర్చి యమిత బలముతోడ నవగతి నీతి కి రీటంబు నేఁ బొంద ||రమ్ము||

4. నేను నీ కొరకే నిత్యము బ్రతికి నిన్ను గణుతించి మానుగ 'భళా' యను మంచి వాక్యము విని దీన ప్రభుని సమా ధానములో నేఁ జేర ||రమ్ము||

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...