Friday, May 11, 2018

RAMMU! NEE THARUNAMIDHAE TELUGU LYRICS


రమ్ము! నీ తరుణమిదే పిలచుచున్నాడు నీ ప్రభువైన యేసు నొద్దకు

1. జీవితమంతయు వ్యర్థముగను దుఃఖముతోను గడుపుటయేల వచ్చి ఆయన శరణు జొచ్చినచో వాంఛతో నిన్ను స్వీకరించున్ ||రమ్ము||

2. కట్టిన యిల్లు ధనధాన్యములు కనబడు బంధుమిత్రులును గూడు విడిచి నీవు పోయినచో వెంటనీతో రారెవరు ||రమ్ము||

3. అందము మాయ అస్థిరమే దాని నమ్మకుము మోసగించును మరణము ఒకనాడు వచ్చును మరువకు నీ ప్రభువును ||రమ్ము||

4. మిన్ను క్రిందన్ భూమి మీదన్ మిత్రుడేసు నామముగాక రక్షణ పొందు దారిలేదు రక్షకుడేసే మార్గము ||రమ్ము||

5. తీరని పాపవ్యాధులను మారని నీదు బలహీనతల్ ఘోర సిలువలో మోసితీర్చెన్ గాయములచే బాగుపడన్ ||రమ్ము||

6. సత్యవాక్కును నమ్మి రమ్ము నిత్యజీవమును నీకిచ్చున్ నీ పేరు జీవపుస్తకమునందు నిజముగ ఈనాడే వ్రాయున్ ||రమ్ము||

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...