Friday, May 11, 2018
SAAKSHYA MICHCHEDHA SVAAMI TELUGU LYRICS
సాక్ష్య మిచ్చెద స్వామి యేసు దేవుఁ డంచు సాక్ష్య మనఁగఁ గనిన వినిన సంగతులను దెల్పుటయే సాక్ష్య మిచ్చు కొఱుకు నన్ను స్వామి రక్షించె నంచు ||సాక్ష్య||
1. దిక్కు దెసయు లేని నన్ను దేవుఁ డెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మశ్శాంతి నిచ్చినాఁడో ||సాక్ష్య||
2. పల్లెటూళ్ల జనుల రక్షణ భారము నాపైని గలదు పిల్లలకును బెద్దల కును బ్రేమతో నా స్వానుభవము ||సాక్ష్య||
3. బోధ చేయలేను వాద ములకుఁ బోను నాక దేల నాధుఁ డేసు ప్రభుని గూర్చి నాకుఁ దెలిసినంత వరకు ||సాక్ష్య||
4. పాపులకును మిత్రుఁ డంచుఁ బ్రాణ మొసఁగి లేచె నంచుఁ బావముల క్షమించు నంచుఁ బ్రభుని విశ్వసించుఁ డంచు ||సాక్ష్య||
5. చోరు లైన జారు లనా చారు లైన నెవ్వరైన ఘోరపాపు లైనఁ క్రీస్తు కూర్మితో రక్షించు నంచు ||సాక్ష్య||
6. పరమత దూషణము లేల పరిహసించి పలుకు టేల ఇరుగు పొరుగు వారి కెల్ల యేసు క్రీస్తు దేవఁ డంచు ||సాక్ష్య||
7. ఎల్లకాల మూరకుండ నేల యాత్మ శాంతి లేక తల్లడిల్లు వారలకును తండ్రి కుమా రాత్మ పేర ||సాక్ష్య||
Subscribe to:
Post Comments (Atom)
KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS
క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...
-
ബലഹീനതയില് ബലമേകി ബലവാനായോന് നടത്തിടുന്നു (2) കൃപയാലെ കൃപയാലെ കൃപയാലനുദിനവും (2) (ബലഹീനത..) 1 എന്റെ കൃപ നിനക്കുമ...
-
मेरी रूह खुदा की प्यासी है - २ जैसे हिरनी पानी के नालो को तरसती है मेरी रूह खुदा की प्यासी है - २ रात और दिन आंसू बहते है दुनिया वाले स...
-
ಪ್ರೀತಿಸುವೆ ಯೇಸು ರಾಜ ಜೀವಂತ ದಿನವೆಲ್ಲ ನಿನ್ನ ಪ್ರೀತಿಯೊಂದೆ ಸಾಕು ಬಾಳಿನ ದಿನವೆಲ್ಲ (2) ಸಾಕಯ್ಯಾ ನಿನ್ ಪ್ರೀತಿ ಸಾಕಯ್ಯಾ ಬೇಕಯ್ಯಾ ನಿನ್ ಕೃಪೆ ಬೇಕಯ್ಯಾ (2) ...
No comments:
Post a Comment