Friday, May 11, 2018

SAAKSHYAMICHCHEDA TELUGU LYRICS


సాక్ష్యమిచ్చెద మన స్వామి యేసు దేవుడంచు
సాక్ష్యమనగా గనిన వినిన సంగతులను దెల్పుటయే
సాక్ష్య మిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించె నంచు ||సాక్ష్య||

దిక్కు దెసయు లేని నన్ను దేవుడెంతో కనికరించి
మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతి నిచ్చినడో ||సాక్ష్య||

పల్లెటూళ్ళ జనుల రక్షణ భారము నా పైని గలదు
పిల్లలకును బెద్దలకును బ్రేమతో నా స్వానుభవము ||సాక్ష్య||

బోధ చేయలేను వాద ములకు బోను నాక దేల
నాధు డేసు ప్రభుని గూర్చి నాకు దెలసినంత వరకు ||సాక్ష్య||

పాపులకును మిత్రుడంచు బ్రాణ మొసగి లేచెనంచు
బాపముల క్షమించు నంచు బ్రభుని విశ్వసించు డంచు ||సాక్ష్య||

చోరు లైన జారు లనా చారు లైన నెవ్వరైన
ఘోరపాపు లైన క్రీస్తు కూర్మితో రక్షించు నంచు ||సాక్ష్య||

పరమత దూషణము లేల పరిహసించి పలుకు టేల
ఇరుగు పొరుగు వారి కెల్ల యేసు క్రీస్తు దేవు డంచు ||సాక్ష్య||

ఎల్లకాల మూరకుండ నేల యాత్మ శాంతి లేక
తల్లడిల్లు వారలకును తండ్రి కుమా రాత్మ పేర ||సాక్ష్య||

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...