Tuesday, March 6, 2018

NEE CHEMTHAKOA PRABHOA NAE TELUGU LYRICS

1. నీ చెంతకో ప్రభో - నే జేరెదన్
కష్టంబు లేచినన్ - నిన్ జేరెద
నా పాట యెప్పుడు - నీ చెంత నుండును
నీ చెంత నుందును - నా రక్షకా

2. భానుండు ద్రిమ్మరి - యిట్టిప్పుడు
క్రుంకంగ నిక్కడ నా చుట్టును
చీకట్లు గ్రమ్మినన్ - స్వప్నంబు నందును
నీ చెంతనుందును - నా రక్షకా

3. ఆకాశమండల - మార్గంబును
నాకీవు చూపుమా - నీ కూర్మిచే
నీ దివ్యదూతలు - నన్ గోరి పిల్వగా
నీ చెంతనుందును - నా రక్షకా

4. నే నిద్రలేక నీ - స్తోత్రంబుతో
శోకంపు రాళ్ళుగ - బేతేలును
నీకై నిర్మింతును - నా దుఃఖమందున
నీ చెంతనుందును - నా రక్షకా

5. ఆనంద పూర్ణమై - పక్షంబులన్
నాకంబు నంటుచు - నే లేచినన్
నా పాటయంతయు - నీ చెంతనుండు
నీ చెంతనుందును - నా రక్షకా

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...