Sunday, May 13, 2018

MAMMUN SRUJIMCHINA DHAEVUMDU PRAANAMU TELUGU LYRICS

1. మమ్మున్ సృజించిన దేవుండు - ప్రాణము
నొసంగి యెప్పుడు - కాపాడు మమ్మును
సంతోష స్వరమెత్తుచు - స్తుతించుచుండుఁడాయనన్

2. పలువిధాలుగా - బాధించు రోగముల్
పోఁగొట్టి మీదను - రాకుండఁజేసెను
సంతోష స్వరమెత్తుచు - స్తుతించుచుండుఁడాయనన్

3. దేవుండు మాత్రమే - రక్షణ మార్గము
నాయత్తపరచి - చూపించె మాకును
సంతోష స్వరమెత్తుచు - స్తుతించుచుండుఁడాయనన్

4. మా నిత్యబాధలు - వారించుకొరకుఁ
దా సొంత పుత్రుని - బంపెన్ సు ప్రేమతో
సంతోష స్వరమెత్తుచు - స్తుతించుచుండుఁడాయనన్

5. ఆనందమొందుడి శ్రీ యేసే మోక్షము
సర్వజనాళికి - ననుగ్రహించును
సంతోష స్వరమెత్తుచు - స్తుతించుచుండుఁడాయనన్

No comments:

Post a Comment

KROTHTHAPAATA PAADANU RAARAE KROTHTHA TELUGU LYRICS

క్రొత్తపాట పాడను రారే - క్రొత్త రూపు నొందను రారే హల్లెలూయ హల్లెలూయ పాట పాడెదన్‌ ప్రభుయేసుకే స్తోత్రం మన రాజుకే స్తోత్రం (2) 1.శృంగ నాధం...